Sachin Tendulkar : భావోద్వేగానికి గురైన సచిన టెండూల్కర్
సత్యసాయి బాబాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నారు
సత్యసాయి బాబాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తాను స్కూలుకు వెళితే తన జుట్టును చూసి సత్యసాయిబాబా అనే వారని, అప్పటి నుంచే ఆయనతో తనకు అనుబంధం ఏర్పడిందని తెలిపారు. అలాగే తాను 1991లో సత్యసాయిబాబాను వైట్ ఫీల్డ్ లో కలిశానని చెప్పారు.
తనకు పుస్తకం ఇచ్చి...
ఈ సందర్భంగా సత్యసాయిబాబా తనకు ప్రజలను జడ్జ్ చేయవద్దని, వారిని అర్ధం చేసుకోవాలని తెలిపారన్నారు. దీని వల్ల చాలా సమస్యలు జీవితంలో తొలగిపోతాయని సచిన్ టెండూల్కర్ చెప్పారు. 2011లో వరల్డ్ కప్ లో తాను ఆినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని, అయితే బెంగళూరు వచ్చినప్పుడు తనకు సత్యసాయిబాబా ఫోన్ కాల్ చేసి ఒక పుస్తకం పంపారన్నారు. అది తనలో దృఢ సంకల్పాన్ని, సానుకూల దృక్పథాన్ని స్పూర్తిని నింపింది. అదే సంవత్సరం తాము ట్రోఫీని కూడా గెలుచుకున్నామని సచిన్ టెండూల్కర్ చెప్పార.