Road Accident : సూళ్లూరిపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాదం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2025-11-21 01:58 GMT

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట వద్ద జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో పలువురికి గాయాలయ్యాయి. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఆరుగురికి గాయాలు...
ప్రమాద సమయంలో 21మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. విజయవాడ నుంచి బెంగుళూరు కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన క్షతగాత్రులను చికిత్సకోసం నాయుడుపేట ప్రభుత్వసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.


Tags:    

Similar News