Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కర్నూలు జిల్లా కోటేకల్ గ్రామం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలు అయ్యాయి. రెండు కార్లు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలయిన వారిని వెంటనే స్థానికుల సహకారంతో పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన...
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే అతి వేగంతో పాటు నిద్రమత్తు కూడా ప్రమాదానికి కారణమని తెలిసింది. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకుని పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.