Kadapa : కూలిపోయిన వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు

కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇళ్లు కూలిపోయింది.

Update: 2025-10-29 06:53 GMT

కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇళ్లు కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు పడిపోవడంతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు కూలిపోవడంతో భక్తులు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. పురాతన భవనం కావడంతో కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.

సెంటిమెంట్ గా భావించి...
కాలజ్ఞాని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపాలెంలోని బి.మఠంలో స్వయంగా నిర్మించుకొని నివాసమున్న ఇల్లు భారీ వర్షాల నేపథ్యంలో కూలిపోయింది. ఆ గృహం నిర్మించి వందల సంవత్సరాలు దాటిపోవడంతో క్రమేణా పాతబడిపోయింది. భవనానికి మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఏం చేసినా దాని రూపం దెబ్బతింటుందని కారణంతో ఆ గృహాన్ని అలాగే ఉంచారు. విషయం తెలుసుకున్న ప్రజలు కూలిపోయిన ఇంటిని చూడటానికి వెళ్తున్నారు.


Tags:    

Similar News