Pawan Kalyan : నేడు చిత్తూరు జిల్లాకు పవన్

నేడు చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు

Update: 2025-12-04 04:07 GMT

నేడు చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. చిత్తూరులో డీడీవో కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.కొత్తగా నిర్మించిన డిస్ట్రిక్ట్ డెవలెప్ మెంట్ ఆఫీస్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.

డీడీవో ఆఫీసును ప్రారంభించి...
మరొకవైపు పవన్ కల్యాణ్ ను కలిసేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన నేతలు కూడా అక్కడి తరలి వచ్చే అవకాశముంది. వారితో కూడా పవన్ కల్యాణ్ కొద్దిసేపు మాట్లాడే అవకాశముందని తెలిసింది. అయితే పవన్ కల్యాణ్ కేవలం తన శాఖకు చెందిన అభివృద్ధి పనులపైనే ప్రధానంగా చర్చించేందుకు ఈ పర్యటనను ఎంచుకున్నారు.


Tags:    

Similar News