Pawan Kalyan : నేడు అవనిగడ్డకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటన సాగుతుంది. మొంథా తుపాను కు కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. అదే సమయంలో చెట్లు, విద్యుత్తు స్థంభాలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పర్యటన సాగుతుంది.
దెబ్బతిన్న ప్రాంతాలను...
రోడ్డు మార్గాన ఆయన బయలుదేరి వెళతారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా నష్టాన్ని పరిశీలించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పవన్ కల్యాణ్ మధ్యాహ్నానికి తిరిగి తన కార్యాలయానికి చేరుకోనున్నారు.