Breaking : చంద్రబాబుకు మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. మొంథా తుపాను పై ఆరా తీశారు. మొంథా తుపాను తీవ్రరూపం దాలుస్తూ ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తీరంలో రేపు తుపాను దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ప్రత్యేకంగా ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తుపాను సమయంలో...
తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, అలాగే అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందించడానికి సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు