Nara Lokesh : నారా లోకేశ్ ఈరోజు చేసే సంచలన ప్రకటన అదే
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరికొద్దిసేపట్లో సంచలన ప్రకటన చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరికొద్దిసేపట్లో సంచలన ప్రకటన చేయనున్నారు. నిన్ననే లోకేశ్ ఢిల్లీలో ఈరోజు ఉదయం 9 గంటలకు సంచలన విషయాలను వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ మేరకు నారా లోకేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నారా లోకేశ్ దేనికి సంబంధించి ప్రకటన చేయనున్నారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
ఏపీకి పెట్టుబడులపై...
అయితే విశాఖలో రేపటి నుంచి భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు జరుగుతున్నందున దానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన నారా లోకేశ్ విడుదల చేసే అవకాశముంది. నారా లోకేశ్ ఏ ప్రకటన చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. 9 గంటలకు లోకేశ్ ఎక్స్ లో ఈ ప్రకటన చేయనున్నారు.