Nara Lokesh : నారా లోకేశ్ రివీల్ చేసిన విషయం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-11-13 05:54 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రెన్యూ పవర్ సంస్థ ఎనభై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని ఎక్స్ ద్వారా నారా లోకేశ్ వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత తిరిగి రెన్యూ పవర్ సంస్థ అడుగు పెట్టనుందని తెలిపింది.

గ్రీన్ ఎనర్జీ రంగంలో...
ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను రెన్యూ పవర్ సంస్థ నెలకొల్పనుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా భారీగా లభించనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.


Tags:    

Similar News