Nandamuri Bala Krishna : నందమూరి బాలకృష్ణ ఆనందం చూశారా?

మహిళల వన్ డే వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయం సాధించిన జట్టును సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందించారు

Update: 2025-11-03 04:30 GMT

మహిళల వన్ డే వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయం సాధించిన జట్టును సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందించారు. మహిళల వన్ డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన తో సమష్టి గా రాణించి ఫైనల్ లో గొప్ప విజయాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

పులికించిపోయామంటూ...

భారతీయులందరూ ఈ ప్రదర్శన చూసి పులకించిపోయారని, ప్రత్యేకించి ఈ విజయం దేశం లోని ప్రతి మహిళకు, బాలికకు గర్వ కారణం, స్ఫూర్తి దాయకమని తెలిపారు. ప్రపంచానికి భారత శక్తి ఏమిటో చాటి చెప్పిన శుభ సందర్భమిది అని, దేశ మహిళా క్రికెట్ రాబోయే రోజుల్లో ఓ మేలి మలుపు తిరగడానికి ఈ అద్భుత విజయం పనిచేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ విజయం పరంపర కొనసాగాలని కోరుకొంటూ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ కు, మిగతా జట్టు సభ్యులకు నా అభినందనలు తెలియ జేస్తున్నానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.


Tags:    

Similar News