Andhra Pradesh : వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అరెస్ట్
వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన లడ్డూ కు వినియోగించిన కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏను అరెస్ట్ చేశారు.
వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన లడ్డూ కు వినియోగించిన కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏను అరెస్ట్ చేశారు. రాజకీయపరంగా ఈ కేసులో ఇదే తొలి అరెస్ట్. వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నార. వైసీపీ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యిని సరఫరా చేసిన వ్యవహారంలో అప్పన్నను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని ప్రమేయం ఉందని ఇప్పటికే పలుమార్లు అప్పన్నను పోలీసులు విచారించారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో...
విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014 లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికయిన నాటి నుంచి మొన్నటి సాధారణ ఎన్నికల వరకూ ఆయన పీఏగా కొనసాగారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో వైసీపీ హయాంలో ప్రొటోకాల్ ఓఎస్డీగా అప్పన్న విధులు నిర్వహించారు. సామర్థ్యం లేని డెయిరీలకు తిరుమలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును అప్పగించడంలో అప్పన్న కీలక పాత్ర పోషించారని భావించి సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేడు న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది.