Kurnool Bus Accident : డ్రైవర్ లక్ష్మయ్య ట్రాక్ రికార్డు చూస్తే?
కర్నూలు బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాన్ని డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
కర్నూలు బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాన్ని డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదానికి గురైన వెంటనే లక్ష్మయ్య బస్సును వదిలి పరారయ్యారు. ప్రమాదం సమయంలో బస్సును నడిపిన డ్రైవర్ లక్ష్మయ్యది ది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామం.
ఫేక్ సర్టిఫికెట్ పెట్టి...
హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంది. లక్ష్మయ్య మాత్రం ఐదో తరగతి వరకే చదివి, పదో తరగతి ఫెయిలైనట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి లైసెన్స్ పొందాడని పోలీసులు గుర్తించారు. 2004లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆ సమయలో క్లీనర్ చనిపోగా ఇతను బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు విచారిస్తున్నారు.