Andhra Pradesh : నేడు జోగి రమేష్ బెయిల్ పిటీషన్ పై విచారణ
మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటీషన్ పై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది
మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటీషన్ పై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. జోగి రమేష్, జోగి రాములు తమకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేశారు.
కస్టడీ పిటీషన్ పై...
ఈ కేసులో నేడు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది. మరొకవైపు ఎక్సైజ్ అధికారులు జోగి బ్రదర్స్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు. పది రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తే విచారణలో ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన విషయాలు తెలుసుకోవాలని పిటీషన్ వేశారు. దీనిపై కూడా విచారణ జరగనుంది.