Andhra pradesh : నేటి నుంచి ఏపీలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఈ నెల 22 వరకు గ్రామసభలను అధికారులు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. స్వామిత్వ పథకంలో రెండో విడత కింద 45 లక్షల ఆస్తులకు కార్డులు జారీ చేయనున్నారు.
నేటి నుంచి వాటర్ షెడ్ జాతీయ సదస్సు
అలాగే నేడు రేపు గుంటూరులో వాటర్ షెడ్ జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రేపు వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మోడల్ ప్రాజెక్టును కేంద్రమంత్రులు సందర్శించనున్నారు. వాటర్ షెడ్ మోడల్ ప్రాజెక్టు కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్, పెమ్మసాని చంద్రశేఖర్ లు సందర్శించనున్నారు.