Tirumala : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మీకొక గుడ్ న్యూస్

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-11-18 12:27 GMT

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. పది రోజుల్లో రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది.

ఆన్ లైన్ లో పదిహేను వేల టిక్కెట్లు...
మిగిలిన ఏడు రోజుల్లో రోజుల్లో 15 వేల చొప్పున ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టెకెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలపై మిగిలిన ఏడు రోజులు దర్శనాలు రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News