Andhra Pradesh : బాధితులకు అండగా ఫ్రీ గా సరకుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావ ప్రాంత ప్రజలకు అత్యవసర సరకుల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావ ప్రాంత ప్రజలకు అత్యవసర సరకుల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది. తుపాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరకులు ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యాభై కిలోల బియ్యం, కందిపప్పు...
మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సరకుల పంపిణీ ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు ఆదేశాలు అందాయి. ఉల్లిపాయలు, కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్ కు ప్రభుత్వం అప్పగించింది.