ఎన్టీఆర్ వర్ధంతికి చంద్రబాబు ట్వీట్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పేదల పెన్నిది, యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేశారని చంద్రబాబు తెలిపారు.
పేదల కోసం...
పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తూ మరింత కాలం ప్రజలకు టీడీపీ సేవ చేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.