Chandrababu : నేడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు

Update: 2026-01-07 02:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. అనంతరం ప్రాజెక్ట్ ను ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రాజెక్ట్ పనులను స్వయంగా పరిశీలించిన అనంతరం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వచ్చే ఏడాది పోలవరం నుంచి నీరు ఇస్తామని చెప్పడంతో పనుల పురోగతిపై చంద్రబాబు అక్కడకు వెళ్లి సమీక్ష చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు

అనంతరం ఢిల్లీకి...
అనంతరం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అదనపు నిధులు కేటాయించాలని చంద్రబాబు అమిత్ షా ను కోరే అవకాశాలున్నాయి. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా చంద్రబాబు అమిత్ షాతో చర్చించనున్నారు.రాత్రికి తిరిగి అమరావతికి చంద్రబాబు రానున్నారు.


Tags:    

Similar News