Andhra Pradesh : నేడు పుట్టపర్తికి చంద్రబాబు
పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు
పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ లు చేరుకుంటారు.
రేపు మోదీ రాక...
రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి రానుండటంతో ఒకరోజు ముందుగానే వీరంతా పుట్టపర్తికి చేరుకుంటారు. సత్యసాయి బాబా స్మారక మందిరాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు వీఐపీల రాకతో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ప్రార్ధనా మందిరంలో కాసేపు వీఐపీలు ఉండనుండటంతో అక్కడకు కూడా కొందరికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే శ్రీ సత్యసాయి భక్తులు దేశ, విదేశాల నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయన శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.