గోదావరి పుష్కరాల్లో ఏపీలో ఎన్ని స్నాన ఘట్టాలంటే?
గోదావరి పుష్కర పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
గోదావరి పుష్కర పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు, మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 26, 2027 నుంచి జూలై 7, 2027 వరకు పన్నెండు రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయం తీసకున్నారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఆరు జిల్లాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో...
తన హయాంలో మూడో సారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు... కొత్తగా 139 ఘాట్లతో పాటు మొత్తం 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని, దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనా వేసిఅందుకు అనుగుణంగాఏర్పాట్లు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.