Chandrababu : కార్తీక మాసంలో చంద్రబాబు పేదలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తీక మాసంలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తీక మాసంలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. కార్తీక మాసంలో మూడు లక్షల ఇళ్లలో నేడు చంద్రబాబు గృహప్రవేశం చేశారు. అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు చిన్నమండెం గ్రామంలో పక్కా ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. అక్కడి నుంచే రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల పక్కా గృహాలకు సంబంధించి గృహప్రవేశాలకు చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు.
మూడు లక్షల గృహాలకు...
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. లబ్దిదారులకు ఆ ఇంటికి సంబంధించిన తాళాలను అందచేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే మాదిరిగా కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పక్కా గృహాలను నిర్మించడం ఎన్టీఆర్ హయాంలో తొలిసారి ప్రారంభమయిందని, అయితే తర్వాత తాము వాటిని కొనసాగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేదకు పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.