కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేతకు కీలక పదవి
కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ కు కీలక పదవి కట్టబెట్టింది
కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేతకు కీలక పదవి కట్టబెట్టింది. మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఈ పదవిలో నియమితులయ్యారు. అదనపు సొలిసిటర్ జనరల్ గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో కొత్తగా ఇద్దరు అదనపు సొలిసిటర్ జనర ల్ ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు సోలిసిటర్ జనరల్ గా...
కనకమేడల రవీంద్రకుమార్ తో పాటు దవీందర్పాల్ సింగ్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కనకమేడల గతంలో రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ తరుపున వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయినా కనకమేడల ఒక్కరే పార్టీలో ఉన్నారు. మిగిలిన వారంతా బీజేపీలో చేరిపోయారు.