మంత్రి లోకేశ్ తో వైసీపీ నేత బొత్స భేటీ

ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది.

Update: 2026-01-26 12:37 GMT

ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నేతలు హాజరయ్యారు. తేనేటి విందును గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం లోక్ భవన్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తేనేటి విందును ఏర్పాటు చేశారు.

లోకేశ్ తో బొత్స ...
వీరితో పాటు మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేశ్ తో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాసేపు కలసి ముచ్చటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్ హోం కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, జనసేన, వైసీపీ నేతలు హాజరై ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags:    

Similar News