Andhra Pradesh : పేదలకు గుడ్ న్యూస్... మూడు నెలలకొకసారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు. రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి గృహప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్ తో ఇల్లు కట్టుకోవడానికి జీవో ఇస్తామని చెప్పారు.
కూటమి పాలనలో...
కూటమి పాలనలో ఇప్పటివరకు మూడు లక్షల ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వం ఆలోచన అని, అందుకే ప్రతి మూడు నెలలకు గృహప్రవేశాలుంటాయని చెప్పారు.