Ambati Rambabu : లోకేశ్, పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు విన్నారా?

మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-11-27 12:04 GMT

మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖను నారా లోకేశ్ పక్కన పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదాయం ఉన్న అని శాఖల్లో లోకేశ్ వేలు పెట్టారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో తమ పార్టీ కార్యకర్తల చేతనే తమ పార్టీ నేతలపై పోస్టులు పెట్టించి, తానే ప్రవచనాలు చెబుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. విద్యాశాఖ శాఖ జగన్ హయాంలో ఒక వెలుగు వెలిగిందన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలోని అన్నంలో పురుగులు వస్తున్నాయని తెలిపారు.

దత్తపుత్రుడిగా...
మరొకవైపు పవన్ కల్యాణ్ అద్భుతంగా వైసీపీని దూషించడానికి, చంద్రబాబు పొగడటానికి పనిచేస్తున్నారని పవన్ పై సెటైర్లు వేశారు. దత్తపుత్రుడిగా పవన్ కల్యాణ్ 2019 నుంచి ఉప్పునీరు వల్ల కొబ్బరితోటల వల్ల నాశనం అయిపోతున్నాయని చెప్పిచడానికి పవన్ చేసిన ప్రయత్నాన్ని అందరం ప్రశంసించాల్సిందేనని అన్నారు. 1980 నుంచి ఈ సమస్య ఉందని రైతులు చెప్పారన్నారు. ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ ప్రారంభమయిన నాటి నుంచి ఈ సమస్య ప్రారంభమయిందన్నారు. 2029 ఎన్నికల్లో కూడా తాను అధికారంలోకి రానివ్వనని చెప్పడానికి పవన్ కల్యాణ్ ఎవరని అంబటి రాంబాబు ప్రశ్నించారు.


Tags:    

Similar News