Vijayawada : విజయవాడ ప్రజలకు అలెర్ట్.. రాత్రి ఏడు గంటల తర్వాత?
విజయవాడలో రాత్రి ఏడు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయని పోలీసు అధికారులు తెలిపారు
విజయవాడలో రాత్రి ఏడు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని అన్ని స్టేషన్లకు పోలీస్ అధికారుల సూచించారు. నగరంలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వాహనాల కదలికలపై ఆంక్షలను విధించారు. నగర పరిధిలో ఎక్కడ వాహనాలు, ప్రజలు రోడ్ల పైకి రాకుండా చూడాలని పోలీసులకు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. వాహనాలన్నింటినీ ఎక్కడకక్కడ నిలిపివేయాలని కోరారు.
అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో...
అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షల అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు.రాత్రి ఏడు గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు రోడ్ల పైకి రాకుండా చూడాలని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని,అందువల్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.