Andhra Pradesh : బాలికలకు నారా లోకేశ్ గుడ్ న్యూస్
బాలికలకు నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు
బాలికలకు నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయడం జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను అందించడంపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను సరఫరా చేయడం జరుగుతోందన్నారర. గతంలో ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్ కిన్ లు ఇచ్చేవారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్ ను ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
గత ప్రభుత్వంలో బకాయీలు...
గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారన్న మంత్రి నారా లోకేశ్ ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగిందన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 96శాతం బాలిలకు తమకు శానిటరీ న్యాప్ కిన్ లు అందుతున్నాయని, 4 శాతం మంది అందడం లేదని చెప్పడం జరిగిందని చెప్పారు. నాణ్యత విషయంలో 1 శాతం బాగాలేదని, 14శాతం పర్వాలేదు, బాగుందని 85శాతం మంది చెప్పారని అన్నారు. శానిటరీ న్యాప్ కిన్స్ ఎబ్సార్ ప్షన్ పై 84శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, బాగాలేదని 2శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సైజ్ విషయంలో 89శాతం మంది బాగుందని, 11శాతం బాగాలేదని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.