Andhra Pradesh : నేడు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ నేడు టీడీపీ నేతలు కొలికపూడి శ్రీనివాస్, కేశినేని చిన్నిలను విచారించనుంది
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ నేడు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో మాట్లాడనున్నారు. ఉదయం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును, సాయంత్రి కేశినేని చిన్నిని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని కోరారు. ఇద్దరు నేతల నుంచి జరిగిన ఘటనపై వివరణ తీసుకోనున్నారు. ఇటీవల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఇద్దరు నేతలు బహిరంగ ప్రకటనలు చేసుకున్న నేపథ్యంలో వీరిని విచారించాలని చంద్రబాబు నిర్ణయించారు.
నివేదికను చంద్రబాబుకు..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీకి భారీగా డ్యామేజీ జరిగింది. దీనిపై చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడాలనుకున్నప్పటికీ లండన్ పర్యటనకు వెళుతున్నందున ఆ బాధ్యతను క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. నేడు ఇద్దరి నేతలను విచారించిన అనంతరం క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై చంద్రబాబుకు నివేదిక ఇవ్వనుంది.