నేడు అమరావతి లో వాజపేయి విగ్రహావిష్కరణ
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారత రత్న అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారత రత్న అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. ముఖ్య అతిథి గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ పివిఎన్ మాధవ్ సారథ్యంలో సుపరిపాలన బస్ యాత్ర నిర్వహించి అమరావతి విగ్రహావిష్కరణ ను అమరావతిలో జరపనున్నారు.
విగ్రహావిష్కరణకు...
ఈ రోజు అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణకు ముఖ్య మంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. అమరావతిలో వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూటమి నేతలందరూ పాల్గొంటారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ ప్రధాని వాజపేయి దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.