Andhra Pradesh : మంత్రుల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదే
మంత్రుల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారయింది.జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై మూడు బృందాలుగా మంత్రులు పర్యటించనున్నారు.
మంత్రుల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారయింది.జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై మూడు బృందాలుగా మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు జిల్లాల్లో ఖచ్చితంగా పర్యటించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు షెడ్యూల్ తయారయింది. ఈ నెల 29, 30 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత పర్యటిస్తారు.
జిల్లాల పునర్విభజనపై...
వచ్చే నెల 2వ తేదీన అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఈ నెల 29న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటించనున్నారు. ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన ఉంటుంది. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటించనున్నారు. వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన ఉంటుంది.