Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పదవీ విరమణ వయసు పెంపు

ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-03-21 12:08 GMT

ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థల మరియు గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాల పెంచాలని నిర్ణయించింది. పెంపుదలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకుున్నారు.

8,500 మందికి లబ్ది...
ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తం గా 8500 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిరాకరించిన ఈ అంశంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ ఏడాది పదవీ విరమణ చేసే ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు ఉద్యోగంలో ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News