Chandrababu : ఉగాది నాడు చంద్రబాబు పేదలకు గుడ్ న్యూస్

ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2026-03-19 06:06 GMT

ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. తెలుగు సంవత్సరం తొలి రోజు పేదలకు సాయం అందించే ఫైలుపై చంద్రబాబు సంతకం చేశారు. 6787 మందికి ఆర్థిక సాయం అందించే రూ.55.63 కోట్ల సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసి నిధులు విడుదల చేశారు.

ఇరవై ఒక్క నెలల్లోనే...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్ ఓసి కింద రూ.1241 కోట్ల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. 21 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా లక్షా 36 వేల 240 మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక సమస్యలు ఉన్నా....పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అందచేశారు.


Tags:    

Similar News