Andhra Pradesh : గుంటూరు కేఎల్ వర్సిటీ కి వెళ్లే రోడ్డు చూశారా?

గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీకి వెళ్లే రహదారి అద్వాన్నంగా మారింది.

Update: 2025-10-07 04:12 GMT

గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీకి వెళ్లే రహదారి అద్వాన్నంగా మారింది. రోడ్లంతా గుంతలమయంగా తయారవ్వడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే గుంతలుఆ యూనివర్శిటీ, పలు స్కూల్, కాలేజీ బస్సులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అంటు గ్రామస్థులు వాపోతున్నారు. కేఎల్ యూనివర్సిటీతో పాటు వరుసగా పలు స్కూల్, కాలేజీ బస్సులతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పార.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ ప్రయాణం చేస్తున్న పట్టించుకునే నాథుడు లేరని గ్రామస్థులు తెలిపారు. నిత్యం తాడేపల్లి పాతురు గ్రామం నుంచి అతి వేగంతో కేఎల్ యూనివర్సిటీ బస్సులు వస్తుండటంతో ప్రమాదకరంగా మారిందంటున్నారు. పలు వాహానాల ధాటికి రోడ్లపై ప్రయాణం చేయాలంటే వణికిపోతున్నామంటున్న పాతురు గ్రామస్తులు, వాహానాల వేగం, అసలే కష్టంలో ఉన్న రోడ్లు వేరసి నిత్యం ప్రయాణం నరకంగా మారిందని చెబుతున్నారు. తమ గ్రామంలో రోడ్డ్లు నిర్మాణం చేసి తమకు అండగా ఉండాలని గ్రామస్థులు కోరుతన్నారు.


Tags:    

Similar News