Nara Lokesh : మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2026-02-25 06:57 GMT

మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ సిక్స్ హామీ లో ఇచ్చిన తొలి హామీ ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. ఒకేరాష్ట్రం, ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శాసనసభలో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఏమేరకు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి, శిక్షణా కేంద్రాల పనితీరు, ఉద్యోగావకాశాలు, ప్రతిపాదిత నూతన పారిశ్రామిక భాగస్వామ్య వివరాలపై ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ,, యార్లగడ్డ వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వెంకటరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు.

క్లస్టర్స్ ను ఏర్పాటు చేసి...
రాయలసీమ, అనంతపురంలలో ఆటోమోటివ్ క్లస్టర్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్, ఏసీ క్లస్టర్ వస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ క్లస్టర్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, గోదావరి జిల్లాలో ఆక్వా క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్ వస్తున్నాయి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ కూడా వస్తున్నాయని, ఆయా క్లస్టర్లలో వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ చాలా అవసరమని తెలిపారు.


Tags:    

Similar News