Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.

Update: 2026-02-24 02:58 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా సీఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. ఇటీవల సమావేశమైన సీఆర్డీఏ సమావేశం పలు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

భూ కేటాయింపులపై...
దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి సీఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. భూ కేటాయింపులపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం ఎవరెవరికి? ఎంత భూమిని కేటాయించలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. ఆర్ 5 జోన్ పై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆర్ 5 జోన్ లో గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన భూములను రద్దు చేసి మరొక ప్రాంతంలో కేటాయించడంపై చర్చించి ఆమోదం తెలపనుంది.


Tags:    

Similar News