Chandrababu : అధికారులపై చంద్రబాబు సీరియస్
శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వాకబు చేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో సీరియస్ కండిషన్లో ఉండి చికిత్స పొందుతున్న ఇద్దరి బాధితుల ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని.. మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు చెప్పారు. వీరిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.