Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నికలపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఎన్నికల కమిషన్ లేఖలు రాసింది. జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల గడువు ముగుస్తుండటంతో ఎన్నికలు జరిపేందుకు గత కొద్ది రోజులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది.
రిజర్వేషన్ల ఖరారు తర్వాత...
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. పంచాయతీ, మండల, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ఎన్నికలను వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ క్యాడర్‌ను పార్టీలు సిద్ధం చేస్తున్నాయి.