Nara Lokesh : రేపటి నుంచి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రేపటి నుంచి ఆస్ట్రేలియా లో పర్యటించనున్నారు

Update: 2025-10-18 07:47 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రేపటి నుంచి ఆస్ట్రేలియా లో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటారు. ఆస్ట్రేలియాలోని అధునాతన యూనివర్సిటీల్లో ఉన్న బోధనా పద్థతులపై నారా లోకేశ్ అధ్యయనం చేయనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో విశాఖలో జరగనున్న సీఐసీ సదస్సుకు సంబంధించి, ఆ సదస్సు ను విజయవంతం చేయాలని రోడ్ షోలను నిర్వహించనున్నారు.

విశాఖ సదస్సుకు...
విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఆహ్వానించేందుకు కూడా నారా లోకేశ్ ఆస్ట్రేలియా వెళుతున్నారు. పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించి వారిని విశాఖకు రప్పించే ప్రయత్నం చేస్తారు.


Tags:    

Similar News