Andhra Pradesh : ఏపీఐఐసీ భూముల విషయంలో కీలక నిర్ణయం
ఏపీఐఐసీ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఏపీఐఐసీ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏ కింద నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములు తొలగింపునకు ఆదేశాలు జారీ చేసింది. జాబితా నుంచి ప్రభుత్వ, డీకేటీ భూములు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు పరిహారం చెల్లించాక భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డెబ్భయి వేల ఎకరాలను...
అభ్యంతరం లేని 70 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీఐఐసీ వద్ద ఉన్న 51,603 ఎకరాల మ్యుటేషన్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ రికార్డులు లేదా వెబ్‌ల్యాండ్‌లో ఏపీఐఐసీ పేరు మీద మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. సబ్‌రిజిస్ట్రార్ల ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.