Nara Lokesh : ఇక వారికి కూడా తల్లికి వందనం.. గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్

తల్లికి వందనం పధకంపై మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2025-09-23 07:21 GMT

తల్లికి వందనం పధకంపై మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ, విద్య, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కు విద్యార్థుల నుంచి తగ్గించిన రెండు వేలను వినియోగిస్తున్నామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు చేసిన తర్వాత తల్లికి వందనం అందజేస్తామని చెప్పామన్నారు.

ఆశావర్కర్లు, అంగన్ వాడీ కుటుంబాలకు..
ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పామని. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని,. సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని చెప్పాంమని తెలిపారు. తల్లికి వందనం నిబంధనలు విషయానికి వస్తే.. గతంలో వైసీపీ పెట్టిన నిబంధనలనే తాము అమలుచేస్తున్నామని, 300 యూనిట్లు, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధన, భూమి నిబంధనలు పెట్టింది వైసీపీ. అర్హులందరికీ తల్లికి వందనం అందజేశామని చెప్పారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం కూడా నగదు అందజేస్తోంది. రెండింటిని జోడించి నగదు జమచేస్తామన్న లోకేశ్ ఇందుకు కొంతసమయం పడుతుందన్నారు. అర్హులందరికీ తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కుటుంబాలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. . కేబినెట్ లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే మినహాయింపు ఇచ్చామని మంత్రి తెలిపారు.






Tags:    

Similar News