ఒకరోజు ముందుగానే పింఛన్లు.. ఏపీ మంత్రి గుడ్ న్యూస్
ఆంధప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఏడాది జనవరి 1వతేదీన నూతన సంవత్సరం సందర్బంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు ఒక రోజు ముందుగా అనగా 31 డిసెంబర్ 2025 వ తేదీన అందజేయడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు.
ఇంటివద్దకే పింఛన్లు...
రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛనుదారులకు రూ .2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 31 వ తేదీన పంపిణి కాకుండా మిగిలిన పెన్షన్ లను జనవరి 2 2026 న సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియచేశారు.