గుంటూరు జిల్లాలో ఐటీ దాడులు

గుంటూరు జిల్లాలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు.

Update: 2025-10-08 04:32 GMT

గుంటూరు జిల్లాలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. పలు దాల్‌ మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.గత కొన్నేళ్లుగా నకిలీ కందిపప్పు, పెసరపప్పు తయారీ చేస్తున్న మిల్లులలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండకి చెందిన మిల్లు వ్యాపారి శ్రీనివాసరావు ఇళ్లు, పప్పు మిల్లుల్లో ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి.

ఆదాయానికి మించి...
ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఐటీ శాఖకు ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు, వినుకొండ, తెనాలి, విజయవాడ, కర్నూలులో సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.400 కోట్ల స్కామ్‌ జరిగినట్లు గుర్తించిన అధికారులు శ్రీనివాసరావు ఇళ్లు, మిల్లుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దాల్‌ మిల్లుల్లో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు కీలక అంశాలపై విచారణ చేయనున్నారు.


Tags:    

Similar News