Rain Alert : ఎడతెరిపి లేని వర్షం... ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తుందిగా?

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం పడుతుంది. నిన్న మొదలయిన వర్షం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి.

Update: 2025-08-27 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం పడుతుంది. నిన్న మొదలయిన వర్షం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షం పడుతుంది. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అతి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కూడా లేకుండా పోయింది.

బలమైన ఈదురుగాలులు...
తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షసూచన ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
అనేక ప్రాంతాలు నీట మునిగి...
విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ భారీ వర్షంతో జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వినాయక చవితి పండగను వేడుకగా జరుపుకుందామని భావించిన ప్రజలకు భారీ వర్షం ఇబ్బందుల పాలు చేస్తుంది. గుంటూరు నగరంలోనూ అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో రహదారుల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ మున్సిపల్ సిబ్బంది నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.









Tags:    

Similar News