Andhra Pradesh : నేడు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ

నేడు ఉద్యోగ సంఘ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది

Update: 2025-10-18 02:27 GMT

నేడు ఉద్యోగ సంఘ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల డిమాండ్లపై నేడు చర్చలు జరగనున్నాయి. గత కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

డిమాండ్లపై...
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లతో పాటు, పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. అయితే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలను ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించింది. డీఏ, పెండింగ్ బకాయీలతో పాటు కొత్త పీఆర్సీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


Tags:    

Similar News