శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ క్రికెటర్ల శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ క్రికెటర్ల శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. రెండున్నర కోట్ల రూపాయల నగదును ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిశ్చయించింది. దీంతో పాటు కడపలో ఇంటిని నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చంద్రబాబు తనతో...
తనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఈ విషయాలను తెలపారని శ్రీచరణి మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని, అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారని, మరింత మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తనతో అన్నారని శ్రీచరణి తెలిపారు.