Vijayawada : నేడు కాత్యాయని రూపంలో దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు

Update: 2025-09-25 02:15 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారి ఆశీస్సులను పొందేందుకు క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

ఉదయం నుంచే బారులు తీరి...
మూడవ రోజు సాయంత్రం 5 గంటలకు 58,087మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో మూడవ రోజు సాయంత్ర సమయానికి పలు రకాల సేవలు, దర్శన టికెట్ల విక్రయ రూపేణా రూ. 31లక్షల 8 వేల 635 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయంలో కుంకుమార్చనలతో పాటు వివిధ సేవల ద్వారా కూడా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కాత్యాయని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శుభప్రదమని పండితులు చెబుతున్నారు.


Tags:    

Similar News