Ys Jagan : నేడు ముఖ్యనేతలతో జగన్ భేటీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్ నేడు తాడేపల్లిలోని ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా రైతులు, విద్యార్థులతో పాటు పలు అంశాలపై పార్టీ తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన నేతలతో చర్చించనున్నారు. అందుబాటులో ఉన్న నేతలు హాజరు కానున్నారు.
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై...
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణ విషయంలో కోటి సంతకాల సేకరణ గురించి ఆరా తీయనున్నారు. ఇప్పటికే సంతకాలను సేకరించిన వైసీపీనేతలు విజయవాడలోని తాడేపల్లి పార్టీ కార్యాలయానికి చేర్చనున్నారు. వాటిని ఈ నెల 17వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరొకవైపు కడప మేయర్ పై కూడా చర్చిస్తారు.