Vijayawada : విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు.. తేలని కారణం
విజయవాడలో ని న్యూ రాజరాజేశ్వరి పేటలో అతిసార కేసులు ఇంకా ఆగలేదు. ఇప్పటికే డయేరియా కేసులు 380 కేసులకు చేరుకున్నాయి
విజయవాడలో ని న్యూ రాజరాజేశ్వరి పేటలో అతిసార కేసులు ఇంకా ఆగలేదు. ఇప్పటికే డయేరియా కేసులు 380 కేసులకు చేరుకున్నాయి. ఇప్పటికే అనేక మంది వచ్చి ఇంకా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాల్లో చేరుతున్నారు. డయేరియా నుంచి బయటపడి ఇంటికి వెళ్లి తిరిగి వాంతులతో బాధపడుతూ వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇంకా నీటి నమూనా పరీక్షలు మాత్రం బయటకు రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియాకు కారణంమాత్రం తెలియరావడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. అక్కడ తాగునీటిని సరఫరా చేస్తుంది. అయినా డయేరియా కేసులు ఆగకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం రోజుల నుంచి...
న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంకా ఇంకా దుకాణాలు, పాఠశాలలు మూతపడే ఉన్నాయి. దాదాపు వారం రాజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. న్యూ రాజరాజేశ్వరి పేటలో దాదాపు కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వారం రోజులు గడిచినా, అతిసార కేసులపై కారణాలను యంత్రాంగం నిర్ధారించకపోవడంతో అసలు కారణం తెలియడం లేదు. నీటి కాలుష్యంపై పెదవి విప్పడం లేదు. ఉపాధి లేక, ఆహారం దొరకక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో అందరూ పేదవారే ఎక్కువగా నివాసం ఉండటంతో ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని, తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
చంద్రబాబు సీరియస్...
నగరపాలక సంస్థ పాలక పక్షం చేతులెత్తేసింది. అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశఆరు. ఆర్ఆర్‌పేటలో డయేరియా అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశఆరు. ఆర్ఆర్‌పేట ఘటన మానవ తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. తురకపాలెం ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా జనం ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో చికిత్స పొందుతూనే ఉన్నారు. కొందరు ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. మొత్తం మీద రాజరాజేశ్వరిపేటలో డయేరియా రోగులు రోజురోజుకూ పెరుగుతుండటం, అధికారులు కారణాలను తేల్చకపోవడంపై ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.