Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

Update: 2025-12-23 03:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 9.30 గంటలకు ‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’లో భాగంగా విద్యార్థులతో వర్చువల్ గా సమావేశమవుతారు. ఉదయం11.50 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎడ్యుకేషన్‌లో ఏఐ విధానంపై ఐఐటీ మద్రాసు బృందంతో భేటీ అవుతారు.

ఆర్టీసీపై సమీక్ష...
మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్టీసీపై సమీక్షిస్తారు. ఆర్టీసీద్వారా ప్రజలకు అందుతున్న సమాచారాన్ని అడిగి తెలుసుకుంటారు. ఉచిత బస్సు పథకంపై స్పందనతో పాటు సిబ్బంది, ఉద్యోగుల విషయాలను అడిగి తెలుసుకుంటారు. అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆర్టీసీలో విద్యుత్తు బస్సుల కొనుగోలుపై కూడా మాట్లాడనున్నారు. సాయంత్రంఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News