Andhra Pradesh : నిరుద్యోగులకు ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ కూడా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీ అడ్మిషన్లు జరగడం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అడ్మిషన్లకు పోటీ ఉందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
అసెంబ్లీలో సమాధానమిస్తూ...
ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకమన్న మంత్రి నారా లోకేశ్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారా లోకేశ్ ఈ రకమైన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పదహారు వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు.